ఐదేళ్ళు దాటిన పిల్లలు పక్కతడుపుతున్నారా ?


రాత్రిళ్ళు నిద్రలో పక్కతడపటం చిన్నపిల్లల్లో తరచు రాతటస్థపడే ఆరోగ్య సమస్య. పుట్టిన తర్వాత పిల్లలు కొన్ని మసాల నుండి 2/3/4/5 సంవత్సరాల దాకా పక్కతడపటం సహజంగా కన్పిపస్తుంది. సంవత్సరాలు గడిచే కొద్ది పక్కలో మూత్ర విసర్జన తగ్గి, మూత్రాశయం గట్టిపడి మూత్రం చేయాల్సిన సమయ మొస్తే టాయిలెట్‌కు వెళ్ళి మూత్ర విసర్జన చేస్తారు. ఈ పక్క తడపటంను రెండు రకాలుగా చెప్పవచ్చు. 


ప్రాథమిక పక్కతడుపుట: పిల్లలు - పుట్టిన దగ్గరనుండి రోజూ ప్రక్కలో మూత్రం చేయుచూ సంవత్సరాలు గడుస్తుంటే ప్రాథమిక పక్క తడుపుట అందురు. మూత్రాశయ నరాలు బలహీనమై మూత్రాశయం నిండినట్లు గ్రహించకపోవుట, రాత్రంతా ఆపుకోలేకపోవడం, ఎక్కువ మూత్రం తయారుకావడం, పగలు తక్కువగా వెళ్లడం.


ఇతర కారణాలు: 1. గాఢనిద్ర- మొద్దు నిద్ర:


గాఢ నిద్రలో ఉంటే మూత్రాశయము నిండినప్పటికీ, ఆ సంకేతాలు సరిగ్గా అందుకోకపోవడంతో పక్కలోనే మూత్ర విసర్జన జరుగుతుంది.


2. ఆహారాల్లో మూత్రం ఉత్పత్తి చేయడం ఎక్కువ చేసేవి తీసుకుంటే మూత్ర విసర్జన ఎక్కువసార్లు జరుగుతుంది. ముఖ్యంగా పుల్లని పండ్లు, కూల్ డ్రింక్స్. ఎక్కువ నీరు త్రాగడం వలన రావచ్చు. విటమిన్లు కూడా మూత్ర విసర్జనని ఎక్కువ చేస్తాయి.


3. నిద్రలో మూత్రం అధికంగా తయారుకావడం, వాసోసిన్ హార్మోను మూత్రం అధికంగా తయారుకావడం అరికడుతుంది. ఆ హార్మోను తక్కు వగా ఉంటే మూత్రము అధికంగా తయారయి పక్క తడుపుతుంటారు.


4. మూత్రాశయం పరిమాణం తక్కువగా ఉండటం. 


5. విరోచనం సరిగ్గాకాక, మల బద్దకం ఎక్కువగా ఉన్న పిల్లల్లో మలం పేరుకొనిపోయి అది మూత్రాశయముపై ఒత్తిడి కలుగజేసి పిల్లలకు తెలియకుండా మూత్ర విసర్జన చేస్తారు.


6. మగ పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది.


7. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 16 శాతం, ఆరు సంవత్సరాలలోపు 13 శాతం, ఏడు సంవత్సరాలలోపు పిల్లల్లో 10 శాతం, 10 సంవత్సరాల లోపు పిల్లల్లో 5 శాతం, 12-14 సంవత్సరాల లోపు పిల్లల్లో 2-3 శాతం, 15-16 సంవత్సరాల పిల్లల్లో 1శాతం ఈ సమస్య బారిన పడుతుంటారు అని సర్వేలు చెబుతాయి.


8. ఎక్కువశాతం వంశపారం పర్యంగా కూడా ఈ సమస్య కన్పిస్తుంది. 


 తీసుకోవలసిన జాగ్రత్తలు:


* రాత్రిళ్ళు పిల్లలు పడుకోబోయేటప్పుడు మూత్రం చేయించాలి. 


*నీళ్ళు తక్కువ త్రాగించాలి  చాక్ లెట్స్, కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదు. 


*పిల్లల్లో ప్రోత్సాహక బహుమతు లిస్తే ప్రయోజనం ఉంటుంది.


*ఈరోజు మూత్రం చేయకపోతే ఒక చిన్న బహుమతి ప్రకటించండి మంచి ఫలితం ఉంటుంది.