డయాబెటిస్ నివారణలో యోగా పాత్ర ...

 



ప్రపంచంలో అతిత్వరగా విస్తరిస్తున్న నాన్ కమ్యూనికబుల్ వ్యాధులలో మధుమేహం ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మధుమేహ రాజధానిగా మారుతోంది. మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్లో మధుమేహాం ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మధుమేహానికి ఏ వైరస్సో, బ్యాక్టీరియానో కారణం కాదు. మన జీవనశైలియే కారణం. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతి చక్రాసన ఒక్కరికీ డయాబెటిస్ నియంత్రణకు గతంలో ఉపయోగిస్తున్న మందుల పనితనం తగ్గడం, వాటితో కొన్ని చిన్నచిన్న దుష్ప్రభావాలు ఉండటం వలన- అలాంటి సైడ్ ఫెక్ట్స్ లేని కొత్త మందులు అందుబాటులోకి తెచ్చారు. వాటి ఖరీదు ఎక్కువగా ఉండటం వలన కేవలం డెవలప్డ్ కంట్రీస్ లో మాత్రమే వీటిని ఎక్కువగా డయాబెటిస్ నివారణలో ఉపయోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలలో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ లేని  కారణంగా అందరూ కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి మన దేశంలో బాధితులు షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచు కోవడానికి ఖర్చు లేని ఒక ప్రత్యామ్నాయం ఎంతో అవసరం. అదే మన భారత దేశంలో వందల ఏళ్ల నుండి ప్రాచుర్యంలో, అందు బాటులో ఉన్న యోగా మరియు ధ్యానం. 


యోగా పాత్ర:


వివిధ భంగిమలలో వంచుతూ శరీరానికి ధృడత్వాన్ని, వ్యాధి నిరోధక శక్తిని పెంచేదే యోగా. యోగాలో అష్టాంగ యోగా, అనుసార యోగా అనే రెండు విధానాలు ఉన్నాయి. వాటిలో అనుసార యోగా శవాసనం తరహాలో అందరూ తేలిగ్గా చేయగలిగేలా ఉంటుంది. యోగాసనాల ద్వారా శరీరంలోని కండరాలను ఒక క్రమ పద్ధతిలో కదిలించడం వలన వాటిలోని గ్లూకోజ్ ఉపయోగించ బడుతుంది.. అంటే ఖర్చవుతుంది. అదే సమయంలో కండరాలని ఇన్సులిన్ రిసెప్టార్స్ (ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది) యొక్క పనితనం మెరుగవుతుంది. తద్వారా రక్తంలోని గ్లూకోజ్ శాతం అదుపులోకి వస్తుంది. దీంతో బాధితులు గతంలో వాడుతున్న మందుల/ ఇన్సులిన్ డోసేజ్ డాక్టర్ సలహా మేరకు తగ్గించుకోవచ్చు. ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నవారు యోగా చేయడం ద్వారా డయాబెటిస్ దశలోకి వెళ్లరు. డయాబెటిసిని నియంత్రించే కొన్ని ఆసనాలు:


1) త్రికోణాసన


2) కటి చక్రాసన


3) సూర్య నమస్కారాలు


4) అర్థ చక్రాసన


5) పవన ముక్తాసన


6) భుజంగ


7) ధనురాసన


8) పాద చక్రాసన వంటివి ఉదర


అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలలో యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే యోగ పవిత్రమైనదే కాదు.. పైసా ఖర్చు లేనిది కూడా. మన ప్రధాని నరేంద్ర మోడీ యోగా, ధ్యానాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. మంచి విషయాలను అనుసరించడం తప్పు కాదు కదా!