సెల్‌ఫోన్ వాడకం వలన మెదడు, చెవి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముందనీ, కొన్ని సార్లు అది కేన్సర్ కి దారితీయవచ్చన్నది చాలామంది ఎప్పటి నుంచో చెబుతున్న మాట! ఇప్పటి వరకూ మాటలకే పరిమితమైన ఈ విషయం ఇప్పుడు పరిశోధనలతో నిజమైంది. సెల్ఫోన్లను రోజులో ఎక్కువ సేపు ఉపయోగిస్తే శరీరంలో ఏ భాగానికైనా కేన్సర్ వచ్చే అవకాశముందన్న విషయం కరోలినా యూనివర్సిటీ వారి పరిశోధనల్లో స్పష్టమైంది. కొన్ని ఎలుకల మీద వీరు కొన్ని నెలల పాటు నిర్వహించారు. కొన్ని తలగాయపడిన నెలల అనంతరం ఎలుకల ఆరోగ్యాన్ని పరిశీలించగా ' ఆడ ఎలుకలకన్నా, మగ ఎలుకల్లోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడాన్ని వీరు గుర్తించారు. అంతే కాక కొన్ని మగ ఎలుకల్లో కేన్సర్ ఫిట్స్ లక్షణాలు గమనించారు. తక్కువ ఆడ ఎలుకల్లో ఈ ప్రభావం తక్కువగా ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు. సెల్‌ఫోన్లు ఉపయోగించే వారిలో స్త్రీల కన్నా పురుషులే ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. కాబట్టి సెల్ఫోనను అవసరమైనంత మేరకే వాడుకోండి. రాత్రిళ్లు పడకకి దూరంగా స్విచ్చాఫ్ చేసి పెట్టుకోండి. అతిగా సెల్ ఫోన్ వాడితే కాన్సరే!