సెరిబ్రల్ ఇన్ఫార్డ్స్ అంటే .. ?

 



సెరిబ్రల్ ఇన్ఫార్డ్స్ అంటే (Cerebral Infarct) మెదడులోని సెరిబెల్లమ్, సెర్బిమ్ లోని కొంత భాగానికి రక్తసరఫరా ఆగిపోయినపుడు, మెదడులోని ఆ ప్రాంతం చచ్చిపోవడమే. మెదడులోని రక్తనాళాలలో, రక్తసరఫరాకు అడ్డుపడే చిన్న, చిన్న క్లాట్స్ (Clots) వుండటం లేక రక్తనాళములలో చిట్లి, రక్తం కారడం, అది గడ్డకట్టి, రక్తనాళంద్వారా మెదడులోని కొన్ని భాగాలకు రక్తసరఫరా జరగకపోవడం వలన మెదడు కణజాలం చచ్చిపోవడాన్ని సెరిబ్రల్ ఇన్ఫెర్ట్స్ అంటారు.


సెరిబ్రల్ ఇన్ఫెర్ట్స్ అంటారు. Infarction or Ishcaemic stroke are one and same దీనినే stroke అని కూడా అంటారు. మెదడు రక్తనాళములలో, కొవ్వు పలకలు పేరుకుపోయి గడ్డకట్టి రక్తసరఫరాకు అడ్డం పడటంతో మెదడులోని ఆ ప్రాంతం చచ్చుబడటం, ఎడమప్రక్క మెదడులో రక్తం గడ్డకట్టితే, శరీరంలోని కుడివైపు భాగములు చచ్చుబడటం లేదా Paralytic stroke లేదా పక్షవాతం బారిన పడటం, అంటే చేతులు, కాళ్ళు, కదిలించలేక పోవటం, ఏదో ఒక ప్రక్క చచ్చుబడటం, తిమ్మిరెక్కడం, మాటలు సరిగా పలకలేక పోవడం, మొహం కండరాలు, కదిలించలేకపోవడం, నోరు మొహం ఒక ప్రక్కకు లాగడం వంటివి వుంటాయి. కాలు, చేయి కదిలించలేకపోవడం లాంటి పక్షవాత లక్షణాలు వుంటాయి.