కీళ్లనొప్పులు హోమియోతో పరార్


మన శరీరంలో Antibodies అనే కణాలు, మన రక్షక వ్యవస్థను కాపా డుతూ పర్యవేక్షిస్తాయి. ఇవి మన శరీరంలో ప్రవేశించే బాక్టీరియా, వైరస్లను ఎదుర్కొంటూ, వాటిని నిరోధించుతూ సమర్థవంతమైన పాత్ర ను పోషిస్తాయి. కొన్ని సమయాలలో ఈ కణాలు మన శరీరంలో వుండే స్వంత కణాలనే శత్రువులుగా భావించి, వాటిని నిర్మూలించుతాయి. అంటే మన లను కాపాడవలసిన కణాలను, అవే నిర్వీర్యం చేస్తాయి. దీని ఫలితంగా శరీరంలో కొన్ని వ్యాధులు వస్తాయి. ఇటువంటి వ్యాధులనే Auto Immune Diseases అంటారు. ఈ తరగతికి చెందిన వ్యాధులలో అతి ముఖ్యమైనది. RHEUMATOID ARTHRITIS దీర్ఘకాలం ఈ వ్యాధి బాధిస్తుంది. ప్రాణాలు తీసేంత వ్యాధి కాకపోయినా, ప్రతి కదలిక రోగికి నరకం చూపిస్తుంది. కీళ్ళు పనిచేయకుండాపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ RHEUMATOID ARTHRITIS లక్షణాలు ఏమిటో చూద్దాం?


ఈ RHEUMATOID ARTHRITIS లక్షణాలు ఏమిటో చూద్దాం?


+ తొలిదశలో నీరసం, ఆకలి లేకపోవడం, తొందరగా అలసిపోవడం, జ్వరం వచ్చినట్టుగా ఒళ్ళంతా నొప్పులుగా వుంటాయి. ఈ కీళ్ళలో నొప్పి, కీళ్ళు కదపలేకపోవడం, కీళ్ళు బిగుసుకుపోవడం.


+ ఉదయం లేచిన వెంటనే కీళ్ళు బిగుసుకుపోయి, నడవలేకపోవటం.


+ చేతివేళ్ళలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. క్రమేపీ మిగతా కీళ్ళలో కనిపిస్తుంది. ఈ వ్యాధి ముదిరిన కొద్ది, కీళ్ళు బిగుసుకుపోయి ఏ పని చేసుకోలేని పరిస్థితి రావచ్చును.


+ అందుకే దీనినే కీళ్ళకు మాత్రమే సంబంధించిన వ్యాధిగా చూడకూడదు.


+ ఊపిరి తిత్తులకు వ్యాపిస్తే ఛాతిలో నొప్పి, ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకునేటప్పుడు నొప్పి మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. ఈ కొంతమందిలో గుండెలో సున్నితమైన పొరలు వాచి Pericarditis అనే వ్యాధి వస్తుంది. దీనివలన ఛాతీలో నొప్పి ఎక్కువగా వుంటుంది. ఈ కొంత మందిలో చేతులలో చిన్న చిన్న కణతులు లాంటివి వస్తాయి. వీటిని RHEUMATOID nadules అంటారు.


+ మరికొంతమందిలో మణికట్టు వద్దవున్న నరం నొక్కుకుపోయి, విపరీతమైన నొప్పితో బాధపడుతారు. దీనిని croral tunnel syndroms అంటారు.


+ కొన్ని కేసులలో RHEUMATOID ARTHRITIS రక్తనాళాల పై దాడి చేసి రక్తనాళాలను బలహీన పరుస్తుంది. దీనివలన గోళ్ళు చుట్టూ నల్లగా అవుతుంది.


 ఈ లక్షణాలు మానసిక, శారీరక మార్పులుగా గోచరిస్తాయి. ఈ లక్షణాల పై ఆధారపడి చికిత్స చేస్తే ఎలాంటి వ్యాధి అయినా తగ్గే అవకాశం వుంది. RHEUMATOID ARTHRITIS చికిత్సా విధానంలో రోగికి సరిపడే మందుని ఎన్నుకోవాలి. వైద్యుని గొప్పతనం ఇక్కడే కనబడు తుంది. వ్యాధికి సంబంధించిన విజ్ఞానం, వ్యాధి మూలంగా శరీర భాగాలకు జరిగిన హాని అంచనా వేయగలిగి, చికిత్స చేస్తే సత్వరమైన పరిష్కారం వుంటుంది.


గఫాలియం(మందుల పేర్లు ): వేళ్ళలో నొప్పి, తిమ్మిరిగా వుంటుంది. నొప్పి కాలి వేళ్ళ వరకు వ్యాపిస్తుంది. పడుకున్నా.. కదిలినా బాధలు ఎక్కువవుతాయి.


లెడంపాల్: నొప్పి పాదంలో మొదలై పైకి వస్తుంది. చల్లటి దనంతో బాధలు ఉపశమనం కలుగుతుంది.  బాధలు ప్రతిరోజు ఒకే సమయంలో వస్తాయి. స్వంత వైద్యంతో RHEUMATOID ARTHRITIS మందులు వాడితే మరింత ముదిరి చాలా సమస్యలు వస్తాయి. అనుభవజ్ఞుని పర్యవేక్షణలో మందులు వాడితే RHEUMATOID ARTHRITIS దూరం కావచ్చు అనడానికి ఎన్నో ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి.